- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kicha Sudeep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kicha Sudeep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన ‘ఈగ’(EEGA) సినిమాలో విలన్ క్యారెక్టర్‌లో తన నటనతో ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నా కిచ్చా సుదీప్ ఇటీవల ‘మాక్స్’( Max) మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఇక తాను నటించిన మాక్స్ సినిమా థియేటర్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుదీప్ మాట్లాడుతూ.. ‘నేను ఇంకా అలసిపోలేదు, కానీ ఏదో ఒక సమయంలో పక్కా రిటైర్ అవుతాను. ప్రతి హీరో ఏదో ఒక సమయంలో బోర్ కొట్టేస్తాడు. అందరికీ ఒక టైమ్ అనేది ఉంటుంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఒక హీరోగా నేనెప్పుడూ సెట్‌లో ఎవరినీ వెయిట్ చేయించలేదు. భవిష్యత్తులో సపోర్టింగ్ రోల్‌లో చేస్తే.. ఇంకొకరి కోసం ఎదురుచూస్తూ కూర్చోను. సోదరుడు, మావయ్య వంటి పాత్రలు చేయడానికి నాకు ఆసక్తి లేదు’ అని అన్నారు.
అలాగే తాను రిజెక్ట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘అవి కథలు నచ్చకపోవడం వల్ల రిజెక్ట్ చేయలేదు. ఈ సమయంలో వాటిని ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం కాదని వాటిని అంగీకరించలేదు. నటనకు విరామం తీసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యే ప్రసక్తే లేదు. ఒకవేళ ప్రధాన పాత్ర అవకాశాలు రాకపోతే దర్శకత్వం, ప్రొడక్షన్ వైపు వెళ్తాను. నేను హీరోగా ఇప్పటి వరకు సాధించిన దానికి ఎంతో సంతృప్తిగా ఉన్నాను’ అని కిచ్చా సుదీప్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






