సినిమా రివ్యూలపై స్టార్ హీరో హాట్ కామెంట్స్

by Chukka Sudharani |

విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యామీనన్ (Nithya Menon) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘తలైవాన్ తలైవి’(Thalaivan Thalaivi).

సినిమా రివ్యూలపై స్టార్ హీరో హాట్ కామెంట్స్
X

దిశ, సినిమా: విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యామీనన్ (Nithya Menon) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘తలైవాన్ తలైవి’(Thalaivan Thalaivi). పాండిరాజ్ (Director Pandiraj) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రగ్గడ్ లవ్ స్టోరీని సత్యజ్యోతి, త్యాగరాజన్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో ‘సార్.. మేడమ్’ (Sir.. Madam Movie) అనే టైటిల్‌తో జులై 25న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా ‘సినిమాపై వచ్చే నెగిటివ్ రివ్వ్యూలు, ట్రోల్స్‌పై మీ రియాక్షన్ ఏంటీ’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. విజయ్ సేతుపతి స్పందిస్తూ.. ‘మేము సినిమాను ప్రజలు ఎంజాయ్ చేయడానికి విడుదల చేస్తాము. కానీ.. సినిమాను వారు ఎలా చూడాలో మేము చెప్పలేము. అంటే.. మేము ప్రేక్షకులకు వండి వడ్డించాము.. కాబట్టి ఆ వ్యాఖ్యలు పూర్తిగా వారి అభిప్రాయంపై ఆధారపడి ఉంటాయి. అలాగే.. వారి నుంచి కామెంట్స్ నుంచి మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి’ అని తెలిపాడు.

ట్వీట్:

Next Story