నాగచైతన్య డైరెక్టర్‌తో స్టార్ హీరో మూవీ.. బాక్స్‌లు బద్దలు కావాల్సిందే అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), చందూ మొండేటి(Chandoo Mondeti) కాంబోలో ఇటీవల వచ్చిన మూవీ ‘తండేల్’(Thandel).

నాగచైతన్య డైరెక్టర్‌తో స్టార్ హీరో మూవీ.. బాక్స్‌లు బద్దలు కావాల్సిందే అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), చందూ మొండేటి(Chandoo Mondeti) కాంబోలో ఇటీవల వచ్చిన మూవీ ‘తండేల్’(Thandel). ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద రాణిస్తోంది. ‘తండేల్’ చిత్రం సూపర్ హిట్ కావడంతో నాగచైతన్య క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అలాగే ఈ హిట్ కాంబోలో మరో మూడు సినిమాలు కూడా రానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, చందూ మొండేటి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన వారంతా బాక్సులు బద్దలు కావాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, సూర్య సినిమాల విజయానికొస్తే.. ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన హిట్ సాధించలేకపోయారు. ప్రస్తుతం సూర్య, కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro). ఇందులో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్(Prakash Raj), నాజర్, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని భారీ అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. ‘రెట్రో’ కోసం సూర్య అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే 1న థియేటర్స్‌లోకి రానుంది.

Next Story