- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘డ్రాగన్’సినిమాపై ప్రశంసలు కురిపించిన స్టార్ హీరో.. అలా అనడంతో కన్నీళ్లు వచ్చాయంటూ ప్రదీప్ ఎమోషనల్ పోస్ట్

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)‘లవ్ టుడే’(Love Today)సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఆయన ఇటీవల ‘డ్రాగన్’(Dragon)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు అశ్వత్ మారిమత్తు(Ashwath Marimathu) దర్శకత్వం వహించగా.. కేఎస్ రవి కుమార్, గౌతమ్ మీనన్, స్నేహ, మిస్కిన్, హర్షంత్ ఖాన్, జార్జ్ కీలక పాత్రలో కనిపించారు. ఒక ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), కయ్యదు లోహార్ (Kayadu Lohar)హీరోయిన్లుగా నటించారు.
అయితే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’(Return of the Dragon)పేరులో విడుదల చేశారు. ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసిందనడంతో అతిశయోక్తి లేదు.‘డ్రాగన్’ అన్ని భాషల్లో ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ఇందులో నటించిన నటీనటులకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ కూడా మంచి రెస్సాన్స్‌ను దక్కించుకుంది. అలాగే పలువురు సెలబ్రిటీల మనసు గెలుచుకుంది.
తాజాగా, ఈ మూవీపై కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్పందించి మూవీ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ విషయం గురించి తెలియజేస్తూ ప్రదీప్ రంగనాథన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘దళపతి విజయ్ సర్ నుండి ‘డ్రాగన్’గురించి వినడం చాలా సంతోషంగా అనిపించింది. నేను ఎలా ఉండేవాడినో మీరందరూ అర్థం చేసుకోగలరని నాకు తెలుసు. మాటలు, సమయానికి ధన్యవాదాలు సార్. కన్నీళ్లు వచ్చాయంటూ’’ రాసుకొచ్చాడు. అలాగే విజయ్‌తో టీమ్ అంతా కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన వారు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.
Read More..