బక్రీద్‌కు రిలీజ్ కానున్న స్టార్ హీరో సినిమా..? పోస్ట్‌తో హైప్..!

by I. Sairam |   (  Updated:2026-02-08 09:30:48  IST  )

దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Akasamlo Oka Tara).

బక్రీద్‌కు రిలీజ్ కానున్న స్టార్ హీరో సినిమా..? పోస్ట్‌తో హైప్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Akasamlo Oka Tara). దర్శకుడు పవన్ సాదినేని(Pawan Sadineni) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్లు సమర్పిస్తుండగా లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక దీనికి జి.వి.ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. ఇక సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆకాశంలో ఒక తార సినిమా క్లైమాక్స్ షూటింగ్ చిన్న షెడ్యూల్ లో జరుగుతోందట. బక్రీద్ స్పెషల్‌గా ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక అప్పటిలోపు షూటింగ్‌తో పాటు అన్నీ పనులు కంప్లీట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story