Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలో జాయిన్ అయిన స్టార్ హీరో.. ఎక్జైటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయంటూ మేకర్స్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-24 15:10:15  IST  )

Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలో జాయిన్ అయిన స్టార్ హీరో.. ఎక్జైటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయంటూ మేకర్స్ ట్వీట్
X

దిశ, సినిమా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(AndhraKingTaluka). మహేష్ బాబు(Mahesh Babu) పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), వై. రవిశంకర్(Ravi Shankar) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ గ్లింప్స్‌లో సినిమా పట్ల అపారమైన అభిమానం ఉన్న యువకుడిగా రామ్ పోతినేని పాత్ర ప్రేక్షకుల మనసుల్ని తాకింది. గ్లింప్స్‌లో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర భారీ కటౌట్ రూపంలో కనిపించి మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర(Upendra) పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇటీవల విడుదలైన ఆయన క్యారెక్టర్ పోస్టర్ ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) కథానాయికగా నటిస్తోంది.

ఇంత అద్భుతమైన తారాగణం, ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా భారీ అంచనాలని పెంచుతోంది. తాజాగా, ఈ మూవీ షూటింగ్‌లో స్టార్ హీరో జాయిన్ అయినట్లు తెలుపుతూ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. పాత్రల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇచ్చే ఉపేంద్ర, ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌ లో జాయిన్ అయ్యారు. ఆయన ఈ చిత్రంలో సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘మా సూర్య కుమార్ ఇక్కడ ఉన్నారు. కీలక షెడ్యూల్‌లో ఆయన పాల్గొనబోతున్నారు. షూట్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. వేచి ఉండండి త్వరలో ఎక్జైటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.

Next Story