- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టినరోజు వేళ షాకింగ్ స్టేట్‌మెంట్.. కొత్త ప్రేయసిని ఇంట్రడ్యూస్ చేసిన స్టార్ హీరో!
బాలీవుడ్(Bollywood) అగ్ర హీరో అమిర్ ఖాన్(Aamir Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దంగల్, పీకే సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్(Bollywood) అగ్ర హీరో అమిర్ ఖాన్(Aamir Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దంగల్, పీకే సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన పుట్టినరోజు వేళ అందరికీ షాకిచ్చాడు. కొత్త ప్రేయసిని మీడియాకు పరిచయం చేశాడు. ముంబయిలో నిర్వహించిన తన పుట్టినరోజు వేడుకల కోసం నిర్వహించిన ప్రెస్మీట్‌లో ఈ విషయాన్ని రివీల్ చేశాడు. తన స్నేహితురాలైన గౌరీ స్ప్రాట్(Gauri Spratt)తో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. తనకు గౌరీ 25 ఏళ్లుగా తెలుసని.. మేమిద్దరం రిలేషన్ స్టార్ట్ చేసి కూడా ఏడాది దాటిందని వెల్లడించారు.
ఆమె ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా తన ప్రొడక్షన్ బ్యానర్లో గౌరీ కూడా పనిచేస్తోందని చెప్పి కుటుంబసభ్యులకు కోలుకోలేని షాకిచ్చారు. మా రిలేషన్ విషయం ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలుసని.. ఈ విషయం తెలిసి వారు చాలా సంతోషించారని అన్నారు. అయితే ఈ ప్రకటన పట్ల అమిర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమిర్‌కు పెళ్లీడు వచ్చిన పిల్లలు ఉన్నారని.. ఈ వయసులో భార్యా, పిల్లల్ని వదిలేసి కొత్త ప్రేయసి అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు ఆమెకు ఇప్పటికే ఆరేళ్ల కుమారుడు ఉండటం విశేషం.
READ MORE ...
‘ఇతరులను నిందించకండి మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి’: సీనియర్ హీరో






