- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రి బెడ్ పై ప్రముఖ నటుడు.. సాయం చేసిన స్టార్ హీరో
టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన కిడ్నీలు ఫెయిల్ అయినట్టు సమాచారం.
ఇటీవల, ఫిష్ వెంకట్ కుమారై స్రవంతి ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పారని ఆమె తెలిపారు. ఈ చికిత్సకు అయ్యే ఖర్చు తమకు భారంగా మారిందని, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయనకు ఆపరేషన్ చేయాలంటే దాదాపు 50 లక్షల రూపాయలు అవసరం అవుతుందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం పై టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen) స్పందించారు. ఈ తరుణంలో ఫిష్ వెంకట్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు.






