Dhanush : కలాం బయోపిక్‌లో స్టార్ హీరో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ పోస్టర్ ఆవిష్కరణ

by Chukka Sudharani |

మల్టీ టాలెంటెడ్ హీరో ధనుష్ భారతదేశ ప్రియతమ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతున్న ఒక భారీ బయోపిక్‌లో నటించనున్నాడు.

Dhanush : కలాం బయోపిక్‌లో స్టార్ హీరో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ పోస్టర్ ఆవిష్కరణ
X

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్ హీరో ధనుష్ భారతదేశ ప్రియతమ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతున్న ఒక భారీ బయోపిక్‌లో నటించనున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించబడింది. ‘కలాం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనేది ట్యాగ్‌లైన్. దీనికి ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’, ‘ఆదిపురుష్’ ఫేమ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్ల కింద అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డాక్టర్ కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌(Cannes Film Festival)లో ఆవిష్కరించిన ‘కలాం’ సినిమా టైటిల్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది.

Next Story