- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షర్ట్ లేకుండా సినిమా ఫంక్షన్‌కు స్టార్ హీరో.. వీడియోలు వైరల్
షర్ట్ లేకుండా సినిమా ఫంక్షన్‌కు స్టార్ హీరో.. వీడియోలు వైరల్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్(Aamir Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దంగల్, త్రీ ఇడియట్స్, పీకే, గజిని వంటి సినిమాలతో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కూలీ సినిమా(Coolie Movie)లో అమిర్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. తాజాగా ఇవాళ కూలీ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తమిళనాడులోని చెన్నైలో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అమిర్ ఖాన్ షర్ట్ లేకుండా బనియన్‌పై వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులతో పాటు మూవీ యూనిట్ కూడా సర్‌ప్రైజ్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.






