- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aamir Khan: ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏముంది.. ఓటీటీలపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’. 2007లో వచ్చిన ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 20న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమీర్ ఖాన్ ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఏదైనా వస్తువును తయారు చేసి ఎనిమిది వారాల్లోనే ఫ్రీగా కొనుగోలుదారుల ఇళ్లకు డెలవరీ చేస్తామా? చేయము కదా. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే సినిమా థియేటర్స్‌లో విడుదలైన కొంతకాలానికే (దాదాపు నాలుగు వారాలకు) ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు. దీంతో ఎలాగో మరో మూడు, నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది ఇంకెందుకు అన్నట్లు.. ప్రేక్షకుడు థియేటర్లకు సరిగా రావడం లేదు. ఓటీటీలోనే సినిమా చూస్తే సరిపోతుంది అనుకుని వారు థియేటర్స్‌కు రాకపోవడంతో నష్టాలు వస్తాయి’ అని చెప్పుకొచ్చాడు.






