- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమా సెట్‌కి వెళ్లిన స్టార్ డైరెక్టర్.. టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
ప్రేమ్(Prem ) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కెడి’.

దిశ, సినిమా: ప్రేమ్(Prem ) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కెడి’. ఈ చిత్రంలో ధ్రువ సర్జా, రవిచంద్రన్(Ravichandran), రమేష్ అరవింద్, సంజయ్ దత్, జిషు సేన్ గుప్తా, నోరా ఫతేహి(Nora Fatehi) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది 1970 సంవత్సరంలో బెంగళూరులో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా, ‘కెడి’ సినిమా సెట్‌కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) వెళ్లారు.
ఈ విషయాన్ని తెలుపుతూ హీరోయిన్ రక్షిత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘నా ప్రయాణంలో చాలా ముఖ్యమైన ఇద్దరు దర్శకులు.. పూరీ , ప్రేమ్. నేను చేసిన మొదటి సినిమా ‘అప్పు’ మా ప్రయాణం మొదలైంది. అప్పటి నుండి మేము ఎల్లప్పుడూ మంచి స్నేహితులు సానుకూలంగా సన్నిహితంగా ఉన్నాము. ఎప్పుడూ ఒకరితో ఒకరం టచ్‌లో ఉన్నాము. కష్టాల్లో పాలు పంచుకుంటాము. నేను అభిమానించే వ్యక్తి ప్రేమ అతని పనిని గౌరవిస్తాను. ఆయన సినిమాలు వేలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వీరి వినయం మర్యాద నన్ను నిలబెట్టేలా చేస్తుంది. అతను ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటాడని నాకు తెలుసు. పూరీ నిన్న మా సెట్‌కి వెళ్లి ప్రతి ఒక్కరితో అద్భుతంగా మాట్లాడటం చాలా బాగుంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం రక్షిత్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






