Rajamouli : వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-27 08:02:49  IST  )

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ రాజమౌళి(Star Director S.S. Rajamouli), సతీమణి రమా రాజమౌళి(Rama Rajamouli) వేధింపుల(Harassment Controversy)ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు

Rajamouli : వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ డైరక్టర్ రాజమౌళి(Star Director S.S. Rajamouli), సతీమణి రమా రాజమౌళి(Rama Rajamouli)లు వేధింపుల(Harassment Controversy)ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు. రాజమౌళి స్నేహితుడైన యు.శ్రీనివాస్ రావు(U. Srinivas Rao)తాను అతని టార్చర్ భరించలేక ఆత్మహత్య(Suicide)చేసుకుంటున్నానంటూ..ఇదే నా మరణ వాంగ్మూలం(Death certificaten)అని సెల్ఫీ వీడియో, లెటర్(Selfie video, letter) విడుదల చేయడం సంచలనంగా మారింది.

యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీనివాస్ రావు వ్యవహరించారు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని అయితే ఓ అమ్మాయి కారణంగా మా మధ్య ట్రయంగిల్ లవ్ స్టోరీతో విభేధాలు మొదలయ్యాయన్నారు. ముందు రాజమౌళి..ఆ తర్వాత నేను ప్రేమించానని..అయితే కేరియర్ బిగినింగ్ టైమ్ లో వివాదం వద్ధనుకుని.. రాజమౌళి కోరిక మేరకు నేను ఆ అమ్మాయిని త్యాగం చేశానని చెప్పారు. ఇన్నాళ్లకు అతను నెంబర్ వన్ డైరక్టర్ అయ్యాక గతంలోని విషయాలు ఎవరికో చెప్పానన్న అనుమానంతో నన్ను వేధించడం మొదలు పెట్టాడని..దీంతో అతని టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో, లెటర్ లో శ్రీనివాస రావు ఆరోపించారు.

54ఏళ్ల వయసులో నేను రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని..నేను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయడం లేదని స్పష్టం చేశాడు. నేను చెప్పిన విషయాలపై పోలీసులు వారిని లై డిటెక్టర్ టెస్టులు చేయాలని కోరాడు. రాజమౌళికి మాంత్రిక విద్యలు కూడా తెలుసని...అతను తనకు పోటీగా ఉన్న డైరక్టర్లందరిని తొక్కివేశాడంటూ..ఇప్పుడు మరికొందరు డైరక్టర్లను లక్ష్యంగా చేసుకున్నాడని..వీటన్నింటిపై నిజాలు తెలియాలంటే అతడికి లై డిటెక్టర్ పరీక్షలు చేయాలని శ్రీనివాస్ రావు కోరాడు. సెల్ఫీ వీడియో, లెటర్ ను శ్రీనివాసరావు రాజమౌళి సన్నిహితులకు పంపించాడు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని మెట్టు పోలీస్ స్టేషన్ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.

Next Story