- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి తర్వాత గ్లామర్ ట్రీట్ మరింత పెంచిన స్టార్ బ్యూటీ.. నీ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చంపేస్తున్నావంటూ కామెంట్స్
‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘దసరా’(Dasara), ‘మహానటి’(Mahanati) చిత్రాలకైతే అవార్డులు కూడా వరించాయి.
ఇక ఈ బ్యూటీ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆంటోని తటిల్(Antony Thatil) అనే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి గత ఏడాది పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఓ పక్క సినిమాలతో మరోపక్క భర్తతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ బ్యూటీ మ్యారేజ్ తర్వాత గ్లామర్ ట్రీట్ అమాంతం పెంచేసినట్టు తాజా ఫొటోస్‌ను చూస్తే అర్థమైపోతుంది. శారీలో చాలా గ్లామర్‌గా స్టైలీష్‌గా ఉంది. అలాగే తన కొంటె చూపుతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు నీ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చంపేస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






