- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నారి నారి నడుమ మురారి’ నుంచి స్టార్ బ్యూటీ పోస్టర్ రిలీజ్.. క్యూట్‌గా, అందంగా భలే ఉందే..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ‘నారి నారి నడుమ మురారి’. ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon) అండ్ సాక్షి వైద్య(Sakshi Vaidhya)లు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక దీనికి రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర(Anil Sunkara) తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీకు బాలకృష్ణ ఆల్ టైమ్ సూపర్ హిట్ సినిమా నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari) టైటిల్‌ను ఫిక్స్ చేయండంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
కాగా ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrashekhar) సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా తాజాగా హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు యంగ్ బ్యూటీ సాక్షి వైద్య పుట్టినరోజు కావడంతో ఈ మూవీ నుంచి ఈ భామకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇక పోస్టర్‌లో సాక్షి చాలా క్యూట్‌గా చూడటానికి చాలా అందంగా భలే అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






