‘కె-ర్యాంప్’ నుంచి స్టార్ యాక్టర్ పోస్టర్ రిలీజ్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్

by I. Sairam |

టాలీవుడ్ సక్సెస్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

‘కె-ర్యాంప్’ నుంచి స్టార్ యాక్టర్ పోస్టర్ రిలీజ్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సక్సెస్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఆయన నటిస్తున్న సినిమా ‘కె-ర్యాంప్’(K-Ramp) ఒకటి. జైన్స్ నాని(Jains Nani) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యుక్తి తరేజా(Yukthi Thareja) క‌థానాయికగా న‌టిస్తోంది. అయితే హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా KRamp చిత్రం అక్టోబ‌ర్ 18న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుంచి విడుదల అయిన గ్లింప్స్‌‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా నేడు ఈ మూవీ నుంచి ఓ స్టార్ యాక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీటీమ్.

నేడు సాయి కుమార్(Sai Kumar) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. ‘అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు తీవ్రమైన నటుడు, @saikumaractor గారికి #KRamp బృందం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నది.. ఆయన మరోసారి కిరణ్ అబ్బవరంతో మీ అందరికీ వినోద విందు ఇవ్వబోతున్నారు.. ఈ దీపావళికి అక్టోబర్ 18, 2025 థియేటర్లలో రిలీజ్ కానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం, సాయి కుమార్ ఓ బెంచ్ మీద కూర్చొని ఒకరి ఫేస్ మరొకరు చూస్తూ స్మైల్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

లింక్


Next Story