యంగ్ హీరోయిన్‌తో స్టార్ నటుడు ఎఫైర్.. భార్యతో విడాకులకు సిద్ధమై షాకిచ్చాడుగా! (ట్వీట్)

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. అయితే డైవర్స్ అనేవి చాలా మందికి కామన్ అయిపోయాయి.

యంగ్ హీరోయిన్‌తో స్టార్ నటుడు ఎఫైర్.. భార్యతో విడాకులకు సిద్ధమై షాకిచ్చాడుగా! (ట్వీట్)
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. అయితే డైవర్స్ అనేవి చాలా మందికి కామన్ అయిపోయాయి. చిన్న చిన్న విషయాలకే భాగస్వామితో విడిపోతున్నారు. కొంతమంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా మనస్పర్థలు తలెత్తడంతో డైవర్స్ తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. మరీ దారుణం ఏంటంటే.. ఎన్నో ఏళ్ల పాటు కలిసున్న కొందరు స్టార్స్ కపుల్స్ సైతం పలు కారణాల వల్ల విడిపోతున్నారు. ఇటీవల ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్(G.V. Prakash), జయం రవి(Jayam Ravi) వంటి స్టార్స్ సైతం వివాహ బంధానికి స్వస్తి పలికారు. అయితే కొంతమంది అధికారికంగా ప్రకటిస్తే.. మరికొందరు మాత్రం ముందుగానే వేరుగా ఉంటూ పుకార్లు వచ్చాక తమ విడాకులపై స్పందిస్తూ షాకిస్తున్నారు.

తాజాగా, సీనియర్ నటుడు గోవిందా(Govinda), సునీతా అహుజా(Sunita Ahuja) విడాకులు తీసుకోబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 38 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికేందుకు సిద్ధమైనట్లు టాక్. గత కొన్నేళ్ల నుంచి వీరిద్దరు వేరు వేరుగా ఉంటున్నారని తెలుస్తోంది. విభేదాలు తలెత్తడంతో విడాకులు తప్పనిసరి అని నిర్ణయించుకున్నారట. ఓ యంగ్ హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని సునీత భర్తతో విడిపోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక వాటిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే.. గోవిందా మూనకోడలు నటి ఆర్తి సింగ్ వీరి విడాకులపై స్పందించింది. ‘‘ప్రస్తుతం నేను ముంబైలో లేను. కానీ ఓ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే గోవిందా విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదు. అవాస్తవాలను ఎలా ప్రచారం చేస్తున్నారో అస్సలు అర్థం కావడం లేదు. వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం మానుకోండి. ఒకప్పుడు నా విడాకులు గురించి కూడా వార్తలు వచ్చాయి. అలాంటి వార్తల వల్ల మాతో పాటు మా బంధువుతు, అభిమానులు అనవసర ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి అసత్యాలను ప్రచారం చేయకండి’’ అని చెప్పుకొచ్చింది.

Next Story