Ramayana: ‘రామాయణం’ సినిమాలో శివుడిగా ఆ స్టార్ నటుడు.. పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణం’.

Ramayana: ‘రామాయణం’ సినిమాలో శివుడిగా ఆ స్టార్ నటుడు.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణం’. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్టును నమిత్ మల్హోత్రాతో కలిసి అల్లు అరవింద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. యశ్ రావణుడు పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో శివుడు పాత్రలో మోహిత్ రైనాను ఫిక్స్ చేశారట మేకర్స్. ‘మహాదేవ్’ అనే సీరియల్‌లో శివుడి పాత్ర పోషించిన మోహిత్ రైనా అటూ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజమైన శివుడిగా మైమరపించిన ఆయన యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈయన ‘రామాయణం’లో కూడా శివుడి పాత్రలో కనిపించనున్నాడనే వార్త.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.

Next Story