TVK Vijay: తొక్కిసలాట ఘటన.. టీవీకే అధినేత విజయ్‌కి మరోసారి సీబీఐ సమన్లు

by Ramesh Naini |

కరూర్‌ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌కి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది.

TVK Vijay: తొక్కిసలాట ఘటన.. టీవీకే అధినేత విజయ్‌కి మరోసారి సీబీఐ సమన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం మార్చి 10న (మంగళవారం) తమ ఎదుట హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. 2025, సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన భహిరంగ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

ఇప్పటికే రెండు సార్లు విచారణ..

ఈ ఘటనలో తొలుత సిట్ (SIT) చేపట్టిన ఈ దర్యాప్తును, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును సీబీఐ స్వీకరించింది. నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్న ఉద్దేశంతో మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ఘటనపై జనవరి 12, 19 తేదీల్లో విజయ్‌ను అధికారులు ప్రశ్నించారు. అయితే, సేకరించిన తాజా ఆధారాల ఆధారంగా మరిన్ని వివరణలు కోరుతూ సోమవారం సీబీఐ కొత్తగా నోటీసులు జారీ చేసింది.

Next Story