- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSMB29 షూటింగ్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆనందంలో ఫ్యాన్స్
మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో చిత్రీకరణ జరపగా.. తాజాగా షూటింగ్‌పై మరో అప్డేట్ వచ్చింది. ఈ మేరకు నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ చాలా సంతృప్తికరంగా ఉంది. తదుపరి షెడ్యూల్ నైరోబి అండ్ టాంజానియాలో ప్లాన్ చేయబడింది’ అని తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






