రామాయ‌ణంలోని ముఖ్య‌ ఘ‌ట్టమే ''వారణాసి''... స్టోరీ లీక్ చేసిన‌ రాజ‌మౌళి

by velandi.Saikiran |

మహేష్ బాబుతో సినిమా చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. వారణాసి సినిమా మొదలుపెట్టేటప్పుడు రామాయణంలో

రామాయ‌ణంలోని ముఖ్య‌ ఘ‌ట్టమే వారణాసి... స్టోరీ లీక్ చేసిన‌ రాజ‌మౌళి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మహేష్ బాబు, జక్కన్న కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను కూడా వదిలారు. రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం, మహేష్ బాబు అభిమానులకు బిగ్ స‌ర్ ఫ్రైజ్‌ ఇచ్చింది. టైటిల్ రివీల్ కావడంతో అభిమానులందరూ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు.

మహేష్ బాబుతో సినిమా చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. వారణాసి సినిమా మొదలుపెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఒక్కొక్క డైలాగ్, అలాగే ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదని, గాల్లో ఉన్నట్లు అనిపించింది అంటూ రాజమౌళి వెల్లడించారు. ప్రిన్స్ మహేష్ బాబుకు రాముడు వేషం వేసి ఆ ఫోటో షూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించిందని వెల్లడించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని తెలిపారు.

Next Story