Sri vishnu: మీమర్సే నాకు ఇన్‌స్పిరేషన్.. వైరల్‌గా హీరో శ్రీవిష్ణు కామెంట్స్

by Chukka Sudharani |

యంగ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్‌గా ‘సింగిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు.

Sri vishnu: మీమర్సే నాకు ఇన్‌స్పిరేషన్.. వైరల్‌గా హీరో శ్రీవిష్ణు కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్‌గా ‘సింగిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ ఈ హీరో రెండు, మూడు చిత్రాలు లైన్లో పెట్టినట్లు తెలుస్తుండగా.. వీటిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. యంగ్ హీరోయిన్ శివాని నాగరం, మౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సెప్టెంబర్12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. అయితే.. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో శ్రీవిష్ణు సోషల్ మీడియా మీమర్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘నిజం చెప్పాలంటే మీమర్సే నాకు ఇన్‌స్పిరేషన్.. ఎందుకంటే మనం బయట చాలా నెగిటివిటీ చూస్తున్నాము, ఫేస్ చేస్తున్నాము. వాటిలో నుంచి మంచి రిలీఫ్ ఇచ్చేది మీ మీమర్సే. అందుకే మీరంతా చిన్నవాళ్లు అయిన కూడా మీరే నాకు ఇన్‌స్పిరేషన్స్. ఏ ఒత్తిడిలో ఉన్నా.. దాని నుంచి మేము బయటకు రావడానికి మీకు తెలియకుండా మీరు ఎంతో దోహదపడుతున్నారు. చదువుల్లో, బిజినెస్‌లలో, కుటుంబ విషయాల్లో మీకు చాలా ప్రాబ్లెమ్స్, కష్టాలు ఉండొచ్చు. కానీ ఇది చెయ్యాలంటే మాత్రం ప్యూర్ హార్ట్ ఉండాలి. అందుకే ప్యూర్ హార్ట్ మీమర్స్ అందరికి కూడా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా తరఫున కంగ్రాట్స్. మమ్మల్ని మీరు ఇంకా ఇంకా నవ్వించాలి’ అని తెలిపాడు శ్రీ విష్ణు.

Next Story