- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తగా సినిమాలు తీసే వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పిన శ్రీవిష్ణు.. వీడియో వైరల్
ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ఈషా’.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.అలాగే ఇందులో సిరి హనుమంత్. పృథ్వీ రాజ్ వంటి తదితరులు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్ టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్స్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టాయి.
అయితే నేడు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక బుధవారం ఈ చిత్ర హాంటెండ్ నైట్, ప్రీరిలీజ్‌వేడుక జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కథానాయకుడు శ్రీవిష్ణు విచ్చేసి బిగ్‌టికెట్‌ను లాంచ్ చేసి, ప్రేక్షకుని అంగీకార పత్రంపై శ్రీవిష్ణు సైన్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ ” హారర్ సినిమాలు నాకు పర్సనల్‌గా ఇష్టం. హారర్ సినిమాలు థియేటర్‌లో ఫ్రెండ్స్‌తో చూసినప్పుడు థ్రిల్ల్‌గా ఫీలవుతాను. హారర్ సినిమా ఎక్స్‌పీరియన్స్ చాలా రోజులు గుర్తుండిపోతుంది.
ఈ ఈషా సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా రోజులు అందరిని వెంటాడుతుంది. సో.. అందరూ ఈ సినిమా చూసి అందరూ ఆ ఎక్స్‌పీరియన్ష్ పొందగలరు. అయితే కొత్తగా సినిమాలు తీయాలనుకునే వాళ్లు, బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు భయపడకండి. వంశీ నందిపాటి గారి అడ్రస్ నాకు తెలుసు, రేపో ఎల్లుండో పెడతాను. ఆయనకు మీ సినిమాలు చూపించొచ్చు. నచ్చితే మాత్రం, వేరే స్థాయిలో నిలబెట్టే వరకూ ఆయన నిద్రపోరు. అంత కష్టపడతారు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






