ఆ తేదీన 'శ్రీనివాస మంగాపురం' ట్రైలర్ రిలీజ్

by Pulgam srinivas |

'శ్రీనివాస మంగాపురం' మూవీ ట్రైలర్‌ను జూలై 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఆ తేదీన శ్రీనివాస మంగాపురం ట్రైలర్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, రాషా తడానీ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్‌ను జూలై 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ట్రైలర్‌ను సాధారణంగా విడుదల చేస్తారా? లేక ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పి. ఉదయ్ కిరణ్, జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై పర్వాలేదనిపించే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. జూలై 12న విడుదల కానున్న ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




Next Story