‘శ్రీను’ - ‘మంగా’ను పరిచయం చేయనున్న ‘శ్రీనివాస్ మంగాపురం’ టీమ్

by Pulgam srinivas |

'శ్రీనివాస మంగాపురం' చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన పాత్రల పరిచయ కార్యక్రమాన్ని మే 30న నిర్వహించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

‘శ్రీను’ - ‘మంగా’ను పరిచయం చేయనున్న ‘శ్రీనివాస్ మంగాపురం’ టీమ్
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ చిత్రంలో రషా థడానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న శ్రీను మరియు మంగా పాత్రలను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ పరిచయ కార్యక్రమాన్ని మే 30 సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రాన్ని చందమామ కథలు పిక్చర్స్ LLP బ్యానర్‌పై నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత సి. అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘RX 100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాల తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.




Next Story