- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srinidhi Shetty: నా సక్సెస్ చూడటానికి అమ్మ ఇప్పుడు లేదు.. యంగ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
‘కేజీఎఫ్’ చిత్రంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి

దిశ, సినిమా: ‘కేజీఎఫ్’ చిత్రంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). ఈ అమ్మడు ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) ‘తెలుసు కదా’తో పాటు నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ (Hit-3)లో కూడా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలు షేర్ చేసుకుంది.
‘మా అమ్మనాకు గొప్ప ఇన్‌స్పిరేషన్. ఏదైనా అనుకుంటే పట్టుదలతో సాధించాలని చెప్పేది. హీరోయిన్ అవ్వాలి ఉందని చెప్పినప్పుడు.. అవ్వు చూద్దాం అని చెప్పింది. అలాగే చదువును అస్సలు నిర్లక్ష్యం చేయెద్దని చెప్పేది. మా అమ్మ చెప్పినట్లుగానే కష్టపడి చదివి బీటెక్‌లో టాపర్‌గా నిలిచి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా తెచ్చుకున్నా. ఎంత పెద్ద జాబ్ చేసిన హీరోయిన్ అవ్వాలనే నా కోరిక కళగానే ఉండిపోతుంది అనుకున్నా. మా కుటుంబం సపోర్ట్‌తో హీరోయిన్ కూడా అయ్యాను. కానీ నా సక్సెస్ చూడటానికి అమ్మ లేదు.
నాకు 14ఏళ్లు ఉన్నప్పుడు అమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పుడు నాన్న ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. అమ్మ లేని లోటు తెలియకుండా మమ్మల్ని పెంచారు. అయితే.. కరోనా లాక్‌డౌన్‌తో ‘కేజీఎఫ్-1’ రిలీజ్ వాయిదా పడింది. కొన్నాళ్లకు రెండో పార్ట్ షూటింగ్ మొదలైంది. ఈ రెండు సినిమాలు పూర్తవ్వడానికి దాదాపు ఏడేండ్లు పట్టింది. మరీ ఎక్కువ లేట్ కావడంతో నా కెరీర్ ఇక ముందుకు సాగదు అనుకున్నారు మా ఇంట్లో వాళ్లు. కానీ.. కేజీఎఫ్ మంచి సక్సెస్ అందుకుంది. అంతే కాకుండా కేజీఎఫ్ పార్ట్-2లో నా క్యారెక్టర్ మెయిన్‌గా చూపించడంతో నాకు మంచి పేరుతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చింది.






