‘ఇది ఒక విధంగా వీడ్కోలు పలికినట్లు అనిపించింది’.. హిట్ 3 చిత్ర బృందంపై శ్రీనిధి శెట్టి ఎమోషనల్ పోస్ట్

by Kodari Anjali |

హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘ఇది ఒక విధంగా వీడ్కోలు పలికినట్లు అనిపించింది’.. హిట్ 3 చిత్ర బృందంపై శ్రీనిధి శెట్టి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కేజీఎఫ్ చిత్రంతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. రీసెంట్‌గా ఈ బ్యూటీ నటించి హిట్ 3 చిత్రం విడుదలై.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పటికే వందకోట్ల కలెక్షన్లు దాటింది. నాని అయితే యాక్షన్‌తో ఇరగదీశాడనడంలో అతిశయోక్తిలేదు. ఇక కన్నడ బ్యూటీ శ్రీనిధి కూడా తన అద్భుతమైన ప్రతిభను కనబర్చింది. ఇప్పటికే ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ హిట్ 3 బ్యూటీ శ్రీనిధి శెట్టి సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో అభిమానులతో ఓ పోస్ట్ పంచుకుంది. హిట్ 3 చిత్ర బృందాన్ని మిస్ అయినట్లు అందుకు సంబంధించిన పలు మెమోరీస్‌ను పంచుకుంటూ ఇలా రాసుకొచ్చింది. ‘‘సరే, చివరికి నేను నా ఫోటో డంప్‌లతో ప్రారంభించాను. ఇది ఏదో ఒకవిధంగా వీడ్కోలు పలికినట్లు అనిపించింది. అది సరైనదే & బహుశా నేను కోరుకోలేదు.

అయినప్పటికీ, ఇక్కడే ఇది ప్రారంభమవుతుంది. నా గ్యాలరీ మీది. నిజంగా ఇవన్నీ సరిపోలేవు, కానీ నేను కనీసం 20 స్లయిడ్‌లతో ప్రయత్నించాను. నా ఉత్తమ వ్యక్తులతో ఉత్తమ సమయాలు.. #HIT3 🇺🇸 #కృతజ్ఞతగల ప్రేమ & ప్రేమ మాత్రమే’’ అంటూ రాసుకొచ్చింది.

Next Story