- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Venkatesh 77: వెంకటేష్ 77వ చిత్రంపై అప్డేట్.. హీరోయిన్‌గా పాన్ ఇండియా బ్యూటీ ఫిక్స్!
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వెంకటేష్ కెరీర్‌లో 77వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టులో పూజ కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీకి ‘రమణ కేరాఫ్ ఆనంద నిలయం’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారట.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వినిపిస్తుంది. ఈ మూవీలో వెంకీకి జోడీగా శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారట మేకర్స్. ఇప్పటికే కథ చెప్పగా.. ఈ ప్రాజెక్టును ఓకే చేసని శ్రీనిధి శెట్టి.. సైన్ కూడా చేసినట్లు తెలుస్తుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, హిట్ 3 వంటి చిత్రాలతో పాన్ ఇండియా బ్యూటీగా మారిపోయిన శ్రీనిధి ఇప్పుడు వెంకటేష్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందనే వార్త వైరల్ అవుతుండగా.. వన్ మోర్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్నారు నెటిజన్లు. కాగా.. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉండగా.. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసే ప్లాన్ ఉన్నారట మేకర్స్. లింక్






