- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీదేవి ఆస్తులు.. కోర్టును ఆశ్రయించిన బోనీ కపూర్
దివంగత నటి శ్రీదేవి(Sridevi) ఫ్యామిలీ వివాదంలో చిక్కుకున్నది. ఆమె భర్త బోనీ కపూర్ మద్రాసు హైకోర్టు(Madras High Court)ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: దివంగత నటి శ్రీదేవి(Sridevi) ఫ్యామిలీ వివాదంలో చిక్కుకున్నది. ఆమె భర్త బోనీ కపూర్ మద్రాసు హైకోర్టు(Madras High Court)ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు వ్యక్తులు శ్రీదేవి ఆస్తులపై కన్నేశారు. చట్టవిరుద్ధంగా వారి పేరు మీదకు మార్చుకున్నారు. దీంతో బోనీ కపూర్(Boney Kapoor) కోర్టును ఆశ్రయించారు. ఆ ఆస్తి తమది అని.. శ్రీదేవి ఈ ఆస్తిని 1988 ఏప్రిల్ 19న కొనుగోలు చేసిందని ఆయన కోర్టుకు కపూర్ ఆధారాలు సమర్పించారు. శ్రీదేవి ఎవరి నుంచి అయితే ఆస్తి కొనుగోలు చేసిందో.. ఆ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు హక్కుల కోసం ముగ్గురు వ్యక్తులు ముందుకు వచ్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు.. వారి హక్కును త్వరగా రద్దు చేయాలని కోర్టును కోరారు. దీంతో ఈ ఇష్యూపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్థానిక తాలూకా తహశీల్దార్‌ను హైకోర్టు ఆదేశించారు.






