- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్ సాయం చేయడంపై శ్రీ తేజ్ తండ్రి షాకింగ్ కామెంట్స్
అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో భాస్కర్ భార్య

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో భాస్కర్ భార్య రేవతి మరణించగా, అతని కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. దాదాపు ఏడాది కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. ఈ సంఘటన జరిగి ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో, శ్రీ తేజ్ గురించి రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి.
అల్లు అర్జున్ నుంచి సరిగ్గా సహాయం అందడం లేదని కొంతమంది ప్రచారం చేశారు. అయితే దీనిపై స్వయంగా శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. తొక్కిసలాట సంఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో పాటు బన్నీవాసు ఇద్దరు సపోర్టుగా నిలిచారని వెల్లడించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను వాళ్లే చక్కదిద్దుతున్నారని వివరించారు. ఎంత ఖర్చైనా వాళ్లే భరిస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు మరికొంత ఆర్థిక సహాయం అవసరం కావాల్సి ఉందని పేర్కొన్నారు.
దీనిపై దిల్ రాజుతో మాట్లాడినట్లు స్పష్టం చేశారు. దిల్ రాజు కూడా అన్ని విధాల సహాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ టీం కూడా ఇప్పటి వరకు బాగానే రెస్పాండ్ అయిందని క్లారిటీ ఇచ్చారు. కాగా శ్రీ తేజ్ పేరుపైన రెండు కోట్ల రూపాయలను అల్లు అర్జున్ డిపాజిట్ చేసినట్లు దిల్ రాజు పేర్కొన్నారు. ఆ డబ్బుల నుంచి వచ్చే వడ్డీని ఆస్పత్రి ఖర్చు కోసం తండ్రికి వచ్చేలా చేసినట్లు వివరించారు. అలాగే ఆసుపత్రి బిల్లు కూడా రూ.70 లక్షల వరకు అల్లు అర్జున్ కట్టినట్లు గుర్తు చేశారు దిల్ రాజు.






