శ్రీరామ నవమి స్పెషల్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘జాట్’ సినిమా సెకండ్ సింగిల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-27 09:19:21  IST  )

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT).

శ్రీరామ నవమి స్పెషల్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘జాట్’ సినిమా సెకండ్ సింగిల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT). ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా నటిస్తున్న మొదటి తెలుగు చిత్రమిది. అయితే దీనిని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇందులో వినీత్ కుమార్, రణ్‌దీప్ హుడా(Randeep Hooda) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ‘జాట్’ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. నేడు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా చిత్రబృందం ‘జాట్’ సెకండ్ సాంగ్‌ను వదిలారు. ‘‘ఓ రామ శ్రీరామా’’ అని సాగే ఈ పాట గూస్ బంప్స్‌ను తెప్పిస్తోంది. ఇందులో సన్నీ డియోల్ బ్యాగ్ పట్టుకుని వస్తుండగా.. సాధువులు అంతా చుట్టు గుమిగూడారు. లిరికల్ వీడియోను షేర్ చేసిన మేకర్స్ అందరిలో ఆసక్తిని పెంచారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Video Link

Next Story