Sri Chidambaram: బ్యూటీఫుల్ విలేజ్ డ్రామాతో రాబోతున్న సరికొత్త సినిమా.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్

by Chukka Sudharani |

కిరణ్ అబ్బవరం ‘క’ వంటి సన్సేషనల్‌ సినిమాను అందించిన మేకర్స్‌.. ఇప్పుడు మరో డిఫరెంట్‌ అండ్‌ న్యూ ఏజ్‌ కాన్సెప్ట్‌ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

Sri Chidambaram: బ్యూటీఫుల్ విలేజ్ డ్రామాతో రాబోతున్న సరికొత్త సినిమా.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్
X

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం ‘క’ వంటి సన్సేషనల్‌ సినిమాను అందించిన మేకర్స్‌.. ఇప్పుడు మరో డిఫరెంట్‌ అండ్‌ న్యూ ఏజ్‌ కాన్సెప్ట్‌ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. వినయ్ రత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. వంశి తుమ్మల, సంధ్య వశిష్ట హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీ చిదంబరం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ.. తాజాగా టైటిల్‌ గ్లింప్స్‌ను హీరో కార్తీకేయ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘యంగ్‌స్టర్స్‌ అంతా కలిసి చేసిన ఫ్రెష్‌ ఫీల్‌ మూవీ ఇది. మెల్లకన్ను ఉన్న యువకుడు ఇన్‌సెక్యూర్‌తో కళ్ళద్డాలు పెట్టుకుని లైఫ్‌ని మేనేజ్‌ చేస్తుంటాడు. అలాంటి అబ్బాయి లవ్‌లో పడితే ఏం జరుగుతుంది అనే ఓ ఫన్‌ డ్రామా చుట్టు జరిగే కథ ఇది. బ్యూటిఫుల్‌ విలేజ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. చిత్రంలో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చే చిత్రమిది’ అని తెలిపారు. లింక్

Next Story