- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sreemukhi: పవర్‌స్టార్ సాంగ్ జోడించి బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోన్న స్టార్ యాంకర్
తెలుగులో టాప్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో టాప్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూతెలుగు ప్రేక్షకుల్ని తన మాట తీరుతో మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది ఈ బ్యూటీ. తరచూ ట్రెడిషనల్ అండ్ మోడ్రన్‌గా అదిరిపోయే ఫొటో షూట్లు చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది. ఎక్కువగా ఈ అమ్మడు నిండైన బట్టలతో దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు.
శ్రీముఖి ఓ వైపు యాంకరింగ్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటూనే మరోవైపు సినిమాలల్లో నటిస్తూ జనాల్ని అలరిస్తుంది. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ప్రారంభించింది మరియు సూపర్ సింగర్ 9 అనే పాటల కార్యక్రమానికి కూడా హోస్ట్‌గా వ్యవహరించింది . శ్రీముఖి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) సిస్టర్‌గా జులాయి మూవీలో రాజిగా నటించింది.
అలాగే పవన్ సాదినేని దర్శకత్వంలో ప్రేమ ఇష్క్ కాదల్‌లో ప్రధాన నటిగా తన సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత ఆమె నేను శైలజ సినిమాలో రామ్ పోతినేని సిస్టర్‌గా నటించింది. శేఖర్ కమ్ముల రూపొందించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(Life is beautiful)లో ఒక చిన్న అతిధి పాత్రలో.. ధనలక్ష్మి తలుపు తడితే, నారా రోహిత్ సావిత్రిలో కీలక పాత్రలో కనిపించింది. వీటితో పాటు ఆమె సత్య సరసన తన మొదటి తమిళ చలనచిత్రం ఎట్టుతిక్కుం మధాయనైలో నటించి మెప్పించింది.
ఇకపోతే తాజాగా తాజాగా స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్ ధరించి.. బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని ఖతర్నాక్ ఫొటోలకు ఫోజులిచ్చింది. తాజాగా శ్రీముఖి ఈ పిక్స్ సోషల్ మీడియా వేదికన తన అభిమానులతో పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే కాకుండా స్టోరీగా కూడా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సాంగ్ జోడించి షేర్ చేసింది. ప్రజెంట్ ఈ యాంకర్ లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






