- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela: బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిందిగా! (వీడియో)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ‘పెళ్లి సందడి’ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ‘పెళ్లి సందడి’ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత రవితేజ (Ravi Teja)సరసన ‘ధమాకా’ మూవీలో నటించి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో శ్రీలీల ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అయిపోయి వరుస అవకాశాలు అందుకుంది. అప్పట్లో ఆమె చేతిలో పది సినిమాలు కూడా ఉన్నాయి. కానీ బ్యాక్ టు బ్యాక్ నాలుగు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా శ్రీలీల క్రేజ్ తగ్గిపోయింది. దీంతో ఆమె కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి యాడ్స్ చేసింది.
మళ్లీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఈ ఒక్క పాటతో ఆమెకు మళ్లీ వరుస అవకాశాలు వచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం శ్రీలీల ‘రాబిన్‌హుడ్’(Robinhood) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఆషికి-3, పరాశక్తి, వంటి సినిమాల్లోనూ నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) సరసన ఓ మూవీ చేస్తోంది.
ఇటీవల ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇందులో వీరిద్దరి రొమాన్స్‌ను చూసిన ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీ లీల, కార్తీక్ ఆర్యన్ కుటుంబ వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. ఈ పార్టీలో డ్యాన్స్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అవి చూసిన వారంతా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు అందుకే ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లి బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక ఆమె అభిమానులు మాత్రం వాళ్లు మంచి ఫ్రెండ్స్ అని అంటున్నారు.
#Sreeleela joined #KartikAaryan's family gathering!❤️✨
— Filmfare (@filmfare) March 4, 2025
The two are set to appear in #AnuragBasu's next which is NOT #Aashiqui3. #Trending pic.twitter.com/yzBxRCzYBw






