Sreeleela: కిసిక్ సాంగ్ ఎఫెక్ట్ .. వాటికీ దూరంగా ఉంటానంటున్న శ్రీలీల?

by Phanindra |

పెళ్ళి సందD మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీలీల (Sreeleela) పరిచయమైంది

Sreeleela: కిసిక్ సాంగ్ ఎఫెక్ట్ .. వాటికీ దూరంగా ఉంటానంటున్న శ్రీలీల?
X

దిశ, వెబ్ డెస్క్ : ‘పెళ్ళి సందD’ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీలీల (Sreeleela) పరిచయమైంది. ఆ మూవీ సరిగా ఆడకపోయినా .. బాక్సాఫీస్ వద్ద మంచి మంచి వసూళ్లు రాబట్టింది. ఈ ముద్దుగుమ్మ నటన మాత్రమే కాకుండా డాన్సుల్లో కూడా హీరోలతో పాటు స్టెప్పులు వేసేస్తుంటుంది. అలా ఆమెకు వరుస సినిమాలలో అవకాశాలు రావడంతో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే ‘ధమాకా’ (Dhamaka) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.

ఎంత ఫాస్ట్ గా హిట్స్ అందుకుందో .. అదే విధంగా డిజాస్టర్లు కూడా అందుకుంది. ఈ మధ్య తీసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో శ్రీలీల సినిమాలకు బై బై చెబుతుందనుకున్నారు. అలాంటి సమయంలో ఈ బ్యూటీకి ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) లో ఐటెం సాంగ్ చేసే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. శ్రీలీల కెరియర్లో చేసిన మొదటి ఐటెం సాంగ్ ఇది. దీని కోసం ఆమె కోటిన్నరకు పైగా పారితోషికం తీసుకున్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం, థియేటర్లలో ‘కిసిక్’ పాట ఓ ఊపు ఊపేస్తోంది. నార్త్ లో కూడా ఈ ముద్దుగుమ్మ గురించే చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చేయాలంటూ నిర్మాతలు కాల్స్ చేస్తున్నారట. కానీ, శ్రీలీల ఇక నుంచి ఐటెం సాంగ్స్ చేయకూడదని నిర్ణయం తీసుకుందట. ఐటెం పాటలు చేస్తే హీరోయిన్ అవకాశాలు రావేమో అనుకుని ఈ సాంగ్స్ కి దూరంగా ఉండాలనుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Next Story