- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sreeleela: అతడితో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేసిన శ్రీలీల.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ‘పెళ్లి సందడి’ సినిమాతో వచ్చి అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ‘పెళ్లి సందడి’ సినిమాతో వచ్చి అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఈ అమ్మడు ‘ధమాకా’ (Dhamaka)చిత్రంతో హిట్ అందుకుని క్రేజీ బ్యూటీగా మారిపోయింది. దీంతో శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అంత ఫేమ్ తెచ్చుకుంది. ఏకంగా ఓకేసారి 10 చిత్రాల్లో నటించే అవకాశం అందుకుంది. దీంతో అంతా ఆమె ఇండస్ట్రీకి షేక్ చేస్తుందని భావించారు. ఈక్రమంలోనే ఊహించని విధంగా వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడంతో వచ్చిన ఫేమ్ అంతా పోయింది. దీంతో కొద్ది కాలంపాటు ఇండస్ట్రీకి కాస్త దూరం అయిన శ్రీలీల ‘పుష్ప-2’ ఐటమ్ సాంగ్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.
ఈ సాంగ్‌తో ఒక్కసారిగా ఆమె రేంజ్ పెరిగిపోయింది. అమ్మడు చేసిన డ్యాన్స్‌కు అంతా మంత్రముగ్దులయ్యారనడంలో అతిశయోక్తి లేదు.ప్రస్తుతం ఆమె మాస్ జాతర(Mass jathara), మదరాసి, అషికీ-3 వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా, శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సిద్దార్థ్ చతుర్వేదితో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేసింది. అతడి పుట్టిన రోజు కావడంతో యాడ్‌కు సంబంధించిన క్లిప్ షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా రకరకాల కామెంట్లు పెడుతున్నారు.






