Sreeleela : బాలీవుడ్‌లో బిజి బిజీ.. వరుస ఆఫర్స్ అందుకుంటున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ

by Chukka Sudharani |

యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) ప్రజెంట్ వరుస సినిమాలతో సందడి చేస్తుంది.

Sreeleela : బాలీవుడ్‌లో బిజి బిజీ.. వరుస ఆఫర్స్ అందుకుంటున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) ప్రజెంట్ వరుస సినిమాలతో సందడి చేస్తుంది. రీసెంట్‌గా నితిన్ ‘రాబిన్ హుడ్’ (Robin Hood) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత మరో చిత్రం అనౌన్స్ చెయ్యలేదు ఈ అమ్మడు. అయితే.. బాలీవుడ్‌లో మాత్రం ఓ బిగ్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ (Bollywood) వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. బాలీవుడ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తాజాగా మరో మూవీ ఓకే చేసినట్లు టాక్. రాజ్ షాండిల్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే.. మహావీర్ జైన్, మృగ్దీప్ సింగ్ లాంబా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పటికే మేకర్స్ కథ చెప్పగా శ్రీలీల కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందట. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు నెట్టింట వైరల్ కావడంతో.. శ్రీలీల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story