- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల(Tollywood Sensational Heroine Srileela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిందో గానీ.. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఓ ఊపు ఊపింది. ఏకంగా సీనియర్ ప్రముఖ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. బాలకృష్ణ(Balakrishna), మాస్ మహారాజా రవితేజ(Mass. Maharaja Ravi Teja) వంటి సినిమాల్లో చాన్స్ కొట్టేసి.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
రీసెంట్ థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పుష్ప-2 (Pushpa)లో గ్లామర్ స్టెప్పులేసి యువతను ఉక్కిరిబిక్కిరి చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా కుర్రాళ్ల మనసు దోచేసిన శ్రీలీల సోషల్ మీడియా వేదికన మీ కోసం అన్‌పోలాజెటిక్‌గా మాగ్నెటిక్(Unapologetically magnetic) అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ‘ఇప్పుడే చెప్పుకుందాం ఈ స్మోకీ కళ్ల వెనుక చాలా కన్విన్సింగ్ ఉంది’ అని ఓ క్యాప్షన్ జోడించి బ్లాక్ శారీలో అదిరిపోయే ఫొటోలు అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.






