Sreeleela‘మీకు ఆనందపు అలలను పంపుతున్నాను’.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించి శ్రీలీల పోస్ట్

by Kodari Anjali |

కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల (Sreeleela).

Sreeleela‘మీకు ఆనందపు అలలను పంపుతున్నాను’.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించి శ్రీలీల పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల (Sreeleela). ఈ బ్యూటీ మొదట్లో చిన్న చిన్న హీరోల సరసన నటించింది. వెంటనే ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) సరసన అవకాశం కొట్టేసింది. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వరుస అవకాశాలు దక్కాయి.

ఈ అమ్మడు అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిందనడంలో అతిశయోక్తిలేదు. కాగా శ్రీలీలను తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శకులు పోటీ పడ్డారు. టాలీవుడ్ మొదట్లోనే వరుస సినిమాలతో టాలీవుడ్‌ను షేక్ చేసింది. సీనియర్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టింది.

ఇకపోతే శ్రీలీల తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపర విషయాల్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సేషనల్ బ్యూటీ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. బేబీ పింక్ డ్రెస్‌లో క్యూట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ పంచుకుంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘వైట్ కలర్ లవ్ సింబల్ జోడించి.. ఇక్కడి నుండి మీకు ఇలాంటి ఆనందపు అలలను పంపుతున్నాను’’. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story