- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela: బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన శ్రీలీల.. యంగ్ హీరోతో రొమాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేయడంతో అంతా షాక్ (పోస్ట్)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ‘ధమాకా’(Dhamaka) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుని తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ వరుస ఫ్లాప్స్ అందుకోవడంతో కొద్ది రోజులు సినిమాలకు దూరం అయింది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. గత ఏడాది ‘పుష్ప-2’లో ఐటమ్ సాంగ్ చేసి తన డాన్సింగ్ క్వీన్‌గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది.
ప్రస్తుతం రవితేజ(Ravi Teja) ‘మాస్ జాతర’ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సరసన ‘VD-12’ లో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆ వార్తలకు చెక్ పడినట్లు అయింది. ఈ క్రమంలో.. తాజాగా, శ్రీలీల అంతా అనుకుంటున్నట్లుగానే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అయితే ఇందులో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) హీరోగా నటిస్తుండగా..రొమాంటిక్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది.
ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయనప్పటికీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కార్తీక్ ఆర్యన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇందులో భారీ గడ్డంతో, పొడవాటి జుట్టుతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. ఈ వీడియోలో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ రొమాన్స్‌తో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ హైప్ పెంచుతోంది. అయితే ఈ మూవీ ఈ ఏడాది దీపావళి విడుదల కాబోతున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం శ్రీలీల పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది చూసిన వారంతా షాక్ అవుతూ హిట్స్ అందుకుంటున్న హీరోతో మొదటి చాన్స్ వచ్చింది ఇక బాలీవుడ్‌ను షేక్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.






