Siddharth Malhotra: ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్స్‌గా శ్రీలీల, అనన్య పాండే?

by Chukka Sudharani |

బాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) ఒకరు.

Siddharth Malhotra: ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్స్‌గా శ్రీలీల, అనన్య పాండే?
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) ఒకరు. సహాయ దర్శకునిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ (Student of the Year) మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. నటన పరంగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సిద్ధార్థ్ అనతికాలంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకుని వరుస అవకాశాలు అందుకున్నాడు. ఇక గతేడాది మిషన్ మజ్ను మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. రీసెంట్‌గా ‘యోధా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పుష్కర్ ఓజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ధర్మ ప్రొడక్షన్స్ అండ్ మెంటర్ డిసిపుల్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, దిశా పటానీ హీరోయిన్స్‌గా నటించి మెప్పించారు. ఈ ఏడాది మార్చి 15న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వలేదు అనిపించుకుంది.

ఇదిలా ఉంటే.. సిద్ధార్థ్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే ఈ స్టార్ త్వరలో మైథలాజికల్ (Mythological) సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. దీపక్ మిశ్రా దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఫీమెల్ లీడ్‌లో మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తున్న వార్తలు వస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే.. ఇంకా ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కకముందే సిద్ధార్థ్ మరో డైరెక్టర్‌తో చేతులు కలిపినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. రాజ్ షాండిల్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే.. మహావీర్ జైన్, మృగ్దీప్ సింగ్ లాంబా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా యంగ్ బ్యూటీస్ శ్రీలీల (Sreeleela) అండ్ అనన్య పాండే‌(Ananya Pandey)ను అనుకుంటున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా దాదాపు సిద్ధార్థ్, శ్రీలీల, అనన్య కాంబో ఫిక్స్ అయినట్లు తెలుస్తుండగా.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానున్నట్లు తెలుస్తుంది.

Next Story