Kalyan Dev: మళ్లీ ప్రేమలో పడిన శ్రీజ మాజీ భర్త.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

చిరంజీవి(Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ (Sreeja)మొదట ప్రేమ పెళ్లి చేసుకుని దుమారం రేపిన విషయం తెలిసిందే.

Kalyan Dev: మళ్లీ ప్రేమలో పడిన శ్రీజ మాజీ భర్త.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: చిరంజీవి(Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ (Sreeja)మొదట ప్రేమ పెళ్లి చేసుకుని దుమారం రేపిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే మెగా ఫ్యామిలీని కాదనుకొని ఆమె అతడితో వెళ్లిపోయి ఓ కూతురు పుట్టాక విడాకులు తీసుకుని చిరు చెంతకు చేరింది. దీంతో ఆయన శ్రీజను కళ్యాణ్ దేవ్‌‌కు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. అయితే వీరికి కూడా ఓ కూతురు పుట్టింది. ఆ తర్వాత చిరు అల్లుడు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఏమైందో ఏమో తెలియదు కానీ సడెన్‌గా శ్రీజ, కళ్యాణ్ దేవ్(Kalyan Dev) విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ గత కొద్ది కాలంగా వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతున్నాయి. ఇక శ్రీజ తన ఇద్దరు కూతుళ్లో చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది. కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురిని వారానికి ఒకసారైనా కలుస్తూ పలు భావోద్వేగ పోస్టులతో అందరినీ కంటతడి పెట్టిస్తున్నాడు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్న కళ్యాణ్ గత కొద్ది రోజుల నుంచి సైలెంట్ అయ్యాడు.

తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసి వార్తల్లో నిలిచాడు. తన కూతురితో ఉన్న ఫొటోతో పాటు హార్ట్ సింబల్, గులాభి పువ్వులను షేర్ చేస్తూ.. నేను ఎప్పుడూ ప్రేమనే ఎంచుకుంటాను. మీరు అలాగే చేస్తారా? అనే క్యాప్షన్ జత చేశాడు. దీంతో కళ్యాణ్ దేవ్ మళ్లీ ప్రేమలో పడ్డాడని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని శ్రీజకు తెలిసేలా చేయాలని ఈ పోస్ట్ పెట్టాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ కళ్యాణ్ దేవ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story