- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sree leela: ఆయనతో నటించింది 5 రోజులే.. కానీ అనుభవం మాత్రం చాలా గొప్పది.. శ్రీలీల కామెంట్స్ వైరల్
ప్రస్తుతం శ్రీలీల పవన్ కల్యాన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ కూడా చేస్తుంది.

దిశ, సినిమా: ప్రస్తుతం శ్రీలీల పవన్ కల్యాన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ కూడా చేస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రవితేజపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను రవితేజకు పెద్ద అభిమానిని. KICK అండ్ విక్రమార్కుడు సినిమాలు ఎన్నిసార్లు చూసుంటానో అసలు నాకే తెలియదు. ఆయన పాత్రలో చాలా ఈజీగా వేరియేషన్స్ చూపించగల వ్యక్తి. ఏదైన విషయంలో నేను టెన్షన్ పడితే.. ఆయన నాకు మార్గనిర్దేశం చేసేవారు’ అని తెలిపింది.
అలాగే అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. ‘అందరూ నన్ను డ్యాన్సింగ్ క్వీన్ అని పిలుస్తారు.. కానీ అల్లుఅర్జున్ నాకు డ్యాన్సింగ్ కింగ్. పుష్ప 2 లో నాకు అవకాశం వచ్చినప్పుడు.. ఆయనను కలిసిన ప్రతీసారి.. అల్లు అర్జున్‌తో ఎప్పుడు డ్యాన్స్ చేయబోతున్నాను అని అడుగేదాన్ని. అల్లు అర్జున్ బయట చాలా నిశ్శబ్దంగా కనిపించినా.. సెట్‌లోకి మాత్రం చాలా ఎనర్జీతో వస్తారు. నేను ఆయనతో కేవలం 5 రోజులు మాత్రమే పనిచేసినప్పటికీ.. ఆ అనుభవం నాకు క్రాష్ కోర్సు లాంటిది’ అని తెలిపింది శ్రీలీల.






