Sravanthi Chokarapu : చీర కట్టులో మతి పోగొడుతున్న స్రవంతి.. ఎన్నిసార్లైనా అదే మ్యాజిక్

by Pulgam srinivas |   (  Updated:2026-04-17 13:13:48  IST  )

ఎన్నిసార్లు చీరకట్టులో కనిపించినా అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తున్న స్రవంతి చొక్కారపు.

Sravanthi Chokarapu : చీర కట్టులో మతి పోగొడుతున్న స్రవంతి.. ఎన్నిసార్లైనా అదే మ్యాజిక్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి మరియు యాంకర్ అయినటువంటి స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఈమె నటి కావాలనే ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చినట్లు, కానీ కెరీర్ ప్రారంభంలోనే తనకు వివాహం కావడం వల్ల ఆ విషయం తెలిసి సినిమా అవకాశాలు దూరమయ్యాయని ఈమె ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అనేక సినిమా ఈవెంట్లకు యాంకర్‌గా వ్యవహరిస్తూ అద్భుతమైన దశలో తన కెరీర్‌ను ముందుకు సాగిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హే బల్‌వంత్ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈమె వరుస సినిమా ఈవెంట్లతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది.

ఎక్కువ శాతం ఈ బ్యూటీ చీరకట్టులో తన గ్లామర్‌ను ఒలకబోస్తోంది. ఈమె ఎన్నిసార్లు చీర కట్టి వయ్యారాలు ఒలకబోసినా, ప్రతి సారి ఆ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

దాంతో ఈమె అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్సుల కంటే కూడా చీరలపైనే ఫోటోషూట్లు నిర్వహిస్తూ వాటిని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అవి పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story