Sravanthi: వైట్ ఫ్రాక్‌లో స్టైలిష్ పోజులతో మైమరపిస్తున్న క్యూట్ యాంకర్

by Pulgam srinivas |

వైట్ కలర్ గౌనులో వాటితో అందాలను హైలైట్ చేసిన స్రవంతి చొక్కారపు.

Sravanthi: వైట్ ఫ్రాక్‌లో స్టైలిష్ పోజులతో మైమరపిస్తున్న క్యూట్ యాంకర్
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా తన కెరీర్‌ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె, ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, పట్టుదలతో ముందుకు సాగింది.




తర్వాత బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, ముఖ్యంగా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని మంచి గుర్తింపు పొందింది. ఆ షో తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. సినిమా ఈవెంట్లలో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని, ప్రస్తుతం అత్యంత బిజీ యాంకర్‌లలో ఒకరిగా కొనసాగుతోంది.




ఇటీవల కాలంలో సినిమాల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా సుహాస్ హీరోగా వచ్చిన హే బల్‌వంత్ సినిమాలో కీలక పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. స్రవంతి ఎక్కువగా సినిమా ఈవెంట్లకు స్టైలిష్ లుక్స్‌తో హాజరవుతుండటంతో, కెమెరాలన్నీ ఆమెవైపు మళ్లడం సాధారణంగా మారింది.




ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా తరచుగా జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా స్రవంతి చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తన హాట్ మరియు ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.




అందులో స్రవంతి వైట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్‌ వేసుకొని, చేతిలో పూలను పట్టుకొని అందంగా స్మైల్ ఇస్తూ, వివిధ యాంగిల్స్‌లో పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story