- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీకి రాకముందు స్రవంతి ఏం చేసేదో తెలుసా.. నవ్వుతూ కనిపించే బ్యూటీకి ఇన్ని కష్టాలా?
తాజాగా స్రవంతి చొక్కారపు మాట్లాడుతూ... ఇండస్ట్రీలోకి రాకముందు డైమండ్ స్టోర్‌లో పని చేసేదాన్ని. దానితో షాపులో ఉన్నంతసేపు నిల్చొని ఉండాల్సి వచ్చేది. అది చాలా బాధను కలిగించేదని చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగులో యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈమె కొంతకాలం క్రితం తెలుగు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత స్రవంతికి వరుస పెట్టి టీవీ షోలకు, సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేసే అవకాశం దక్కింది. దానితో ఈమెకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హే బల్‌వంత్ అనే చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించింది.
ఈ సినిమాను ఈరోజు అనగా ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం ఈ నటి పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ వచ్చింది. ఆ ప్రచారాలలో ఈమె తనకు చాలా సంవత్సరాల క్రితమే హీరోయిన్గా అవకాశం వచ్చిందని, అంతా ఓకే అయ్యిందని, చెన్నైలో అడ్వాన్స్ కూడా ఇస్తానన్నారని, కానీ అదే సమయంలో తనకు పెళ్లయిందని చెప్పడంతో వారు ఆ తర్వాత తనను సంప్రదించలేదని తెలిపింది. ఇన్నాళ్లకు తనకు హే బల్‌వంత్ మూవీలో అవకాశం వచ్చిందని, దీనితో తనను తాను ప్రూవ్ చేసుకుంటానని చెప్పింది.
ఇక తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేసింది. తాజాగా స్రవంతి మాట్లాడుతూ... తాను ఇండస్ట్రీలోకి రాకముందు ఒక డైమండ్ స్టోర్లో పనిచేసేదాన్నని, అది చాలా కష్టంగా ఉండేదని, షాప్ లో ఉన్నంతసేపు నిల్చొనే ఉండాలని, అది ఎంతో బాధను కలిగించేదని, కానీ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో కష్టాలను అనుభవించానని, ఇక ఆ సమయంలో జీతం తక్కువగానే వచ్చిన ఇన్సెంటివ్స్ మాత్రం బాగా వచ్చేవి, దానితో తన జీవితం గడిచిందని స్రవంతి చెప్పుకొచ్చింది.






