- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనూ ఇమ్మాన్యుయేల్ ‘బూమరాంగ్’ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న వీడియో
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బూమరాంగ్’(Boomerang).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బూమరాంగ్’(Boomerang). ఈ సినిమాకు ఆండ్రూ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో శివ కందుకూరి కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రాన్ని బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్(Big Movie Makers Limited), మై3 మూవీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై లండన్ గణేష్, ప్రవీణ్ రెడ్డి ఊట్ల(Praveen Reddy Ootla) కలిసి నిర్మిస్తున్నారు. ‘బూమరాంగ్’ హారర్ సినిమాగా తెరకె్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఇందులోంచి విడుదలైన రెండు పోస్టర్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచగా.. తాజాగా, ‘బూమరాంగ్’ నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను షేర్ చేశారు మేకర్స్.
ఇందులో ఓ పాత బూతు బంగ్లాను చూపించగా.. భయంకరమైన ఫొటోలు కనిపించాయి. ఇక కొంతమంది హత్యలు చేస్తుండగా.. అనూ ఇమ్మాన్యుయేల్ చూసి కనపించకుండా దాచుకుంటుంది. అడవిలో పరుగులు పెడుతుంది. ఆ తర్వాత ఓ మాస్క్ పెట్టుకున్న అతను ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటాడు. ఇక అది చూసిన అనూ ఇంత మందిని చంపాడా అని షాక్ అవుతుంది. ప్రస్తుతం బూమరాంగ్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, అనూ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రవితేజ, అల్లు శిరీష్ వంటి హీరోలతో నటించి మెప్పించింది. ఇక 2023 ‘జపాన్’ సినిమా తర్వాత నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఏడాది పాటు చిత్రాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ‘బూమరాంగ్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతుండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






