‘ఆహా’కి కిరణ్ అబ్బవరం ప్రత్యేక ధన్యవాదాలు

by Pulgam srinivas |

తాజాగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఆహా నా కెరీర్‌లో చాలా కీలకమైన పాత్ర పోషించింది. నా సినిమాల విషయంలో వారు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

‘ఆహా’కి కిరణ్ అబ్బవరం ప్రత్యేక ధన్యవాదాలు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ మూవీ రేపటి నుంచి, అనగా మే 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. రేపటి నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో మూవీ బృందం ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఆహా నా కెరీర్‌లో కీలకమైన పాత్ర పోషించింది. నేను నటించిన నాలుగు హిట్ సినిమాలు, రెండు ఫ్లాప్ సినిమాలు కూడా ఆహాలోనే ఉన్నాయి. నేను నటించిన ‘సెబాస్టియన్’ సినిమాకు సెకండాఫ్ కాస్త సమస్యగా మారింది. ఆ విషయం తెలిసినా కూడా వారు ఆ చిత్రాన్ని కొనుగోలు చేశారు. అంతలా వారు నన్ను అభిమానిస్తారు” అని తెలిపారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్‌లో కిరణ్ కి “మీరు నిర్మాతల వైపు ఉంటారా? ఎగ్జిబిటర్ల వైపు ఉంటారా?” అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. “గుడ్ ఆఫ్టర్నూన్ సర్.. నన్ను పెద్ద విషయాల్లోకి లాగకండి. నేను చాలా చిన్న వ్యక్తిని” అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆహా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాకు “కిరణ్ అబ్బవరంకి మంచి స్నేహబంధం ఉంది. ఆయన కిరణ్ అబ్బవరం కాదు.. కిరణ్ ఆహావరం” అంటూ ప్రశంసలు కురిపించారు. మరి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Next Story