- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dhanush: ధనుష్ బర్త్‌డే స్పెషల్ కన్ఫర్మ్.. ఆ సినిమా నుంటి టీజర్ రాబోతుంది!
కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక రీసెంట్‌గా ‘కుబేర’ మూవీతో వచ్చి సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఇందులో ‘ఇడ్లీకడై’ ఒకటి. ధనుష్ స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నిత్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకోగా.. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ వచ్చింది. కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్ మేరకు.. ఇడ్లీకడై టీజర్‌ను ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్‌గా ధనుష్ బర్త్‌డే సందర్భంగా జులై 28న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని వర్క్స్ కంప్లీట్ కాగా.. బర్త్‌డే సందర్భంగా స్పెషల్ ట్రీట్‌ను కన్ఫర్మ్ చేస్తూ త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారట మేకర్స్.






