- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RT76: స్పెషల్ సెట్‌లో స్పెషల్ సాంగ్.. RT76 నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘RT76’.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘RT76’. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ రోజు నుంచి హీరో రవితేజ, హీరోయిన్ ఆషికా రంగనాథ్‌పై మూవీ టీం ఒక పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకమైన సెట్ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ పాట అదిరిపోయే డ్యాన్స్ నంబర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.
ఎలక్ట్రిక్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ ఈ సినిమాలో న్యూ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇది హ్యూమర్, ఎమోషన్, రవితేజ మాస్ ఎలిమెంట్స్‌తో ఫుల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఎమోషనల్ కథలతో అలరించే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందిస్తుండంతో మ్యూజికల్‌గా కూడా ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతున్నది.






